చికెన్‌ దుకాణాలపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-05-18T09:22:46+05:30 IST

అధిక ధరకు చికెన్‌ అమ్ముతున్న దుకాణాలపై పోలీసులు దాడి చేశారు.

చికెన్‌ దుకాణాలపై పోలీసుల దాడి

అధిక ధరకు విక్రయిస్తున్న వారిపై కేసు


బంజారాహిల్స్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): అధిక ధరకు చికెన్‌ అమ్ముతున్న దుకాణాలపై పోలీసులు దాడి చేశారు. కిలో రూ. 276 విక్రయించాలని ప్రభుత్వం సూచించింది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 2లోని ఇందిరానగర్‌లో జేసీ రెడ్డి చికెన్‌ సెంటర్‌ యజమాని కొరమవెల్లి, రాయల్‌ చికెన్‌ సెంటర్‌  యజమాని మహ్మద్‌ సర్వర్‌, స్నేహ చికెన్‌ సెంటర్‌ యజమాని ఉస్మాన్‌ఖాన్‌, యూసు్‌ఫగూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో జేసీ రెడ్డి చికెన్‌ సెంటర్‌ యజమాని రవి కిలో చికెన్‌ రూ. 300 విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌, బంజారాహిల్స్‌ పోలీసులు ఆయా చికెన్‌ సెంటర్లపై దాడి చేసి యజమానులపై కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2020-05-18T09:22:46+05:30 IST