కరోనా బాధితులకు ఉచితంగా ప్లాస్మా

ABN , First Publish Date - 2020-09-24T09:03:57+05:30 IST

దేశంలోనే రెండో అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, రోటరీ చల్లా బ్లడ్‌ బ్యాంక్‌ సంయుక్తంగా

కరోనా బాధితులకు ఉచితంగా ప్లాస్మా

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే రెండో అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, రోటరీ చల్లా బ్లడ్‌ బ్యాంక్‌ సంయుక్తంగా ‘పీఎన్‌బీ రోటరీ ప్లాస్మా బ్యాంక్‌’ను ప్రారంభించాయి. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్లాస్మా బ్యాంకును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగస్టు 23న ప్రారంభించారు. ఇందులో భాగంగా కొవిడ్‌ విజేతలుగా నిలిచిన 150 మంది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఉద్యోగులకు అన్ని పరీక్షలు నిర్వహించి ఒక్కొక్కరి నుంచి 2 యూనిట్ల ప్లాస్మాను సేకరించి భద్రపరిచారు. ఈ ప్లాస్మాను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఉద్యోగులకు, సామాన్య ప్రజలకు ఉచితంగా అందించనున్నట్లు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల జనరల్‌ మేనేజర్‌, జోనల్‌ హెడ్‌ అశుతోష్‌ చౌదరి తెలిపారు. ఎవరికైనా ప్లాస్మా అవసరముంటే వారు తమ ఞజ్చూటఝ్చజౌటడౌఠ.ౌటజ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.


కరోనా పరీక్షలకు ఎక్కువ ఖర్చు అవుతుందని దానిని నియత్రించేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని రోటరీ ప్లాస్మా బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ శరత్‌ చౌదరి అన్నారు. వయసు, బ్లడ్‌గ్రూప్‌, అనారోగ్యం, కోలుకున్న సమయాన్ని అనుసరించి వివిధ కేటగిరీల్లో కరోనావిజేత నుంచి ప్లాస్మాసేకరిచాలని రోటరీ హైదరాబాద్‌ మాజీ ప్రెసిడెంట్‌ మద్ది వి.సుదర్శన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ సర్కిల్‌ హెడ్‌ వినాయక్‌ కుమార్‌ సర్దేశ్‌పాండే, సికింద్రాబాద్‌ సర్కిల్‌ హెడ్‌ రాజీవ్‌కుమార్‌ఝా, డీజీఎంలు ఆతి్‌షకుమార్‌ రౌత్‌, ఎం.స్వరాజ్యలక్ష్మి, ఏడీ. షా, ప్రదీప్‌ కేసరి మాలిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T09:03:57+05:30 IST