జాతీయ పతాక ఆవిర్భావ వేడుకలు వాయిదా
ABN , First Publish Date - 2020-04-01T09:19:58+05:30 IST
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ స్మారక సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 99 వసంతాల జాతీయ పతాక ఆవిర్భావ వేడుకలను వాయిదా వేస్తున్నట్టు పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ స్మారక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కేహెచ్.ఎ్‌స.జగదాంబ వెల్లడించారు.

ఇంట్లోనే జాతీయ పతాకానికి సెల్యూట్ చేయండి: జగదాంబ
రాంనగర్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ స్మారక సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 99 వసంతాల జాతీయ పతాక ఆవిర్భావ వేడుకలను వాయిదా వేస్తున్నట్టు పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ స్మారక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కేహెచ్.ఎ్‌స.జగదాంబ వెల్లడించారు. పౌరులందరూ బుధవారం ఇంట్లో ఉండి జాతీయ పతాకానికి జైహింద్ అని సెల్యూట్ చేయాలని ఆమె కోరారు. రాంనగర్ గుండులోని కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 1-4-2020 నుంచి 1-4-2021 వంద సంవత్సరాల జాతీయ పతాక ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు..