దివ్యాంగుల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలి
ABN , First Publish Date - 2020-12-11T07:06:50+05:30 IST
దివ్యాంగుల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలని హెలెన్ కెల్లర్స్ చైర్మన్ పి.ఉమ్మర్‌ఖాన్ అన్నారు.
హెలెన్ కెల్లర్స్ చైర్మన్ ఉమ్మర్‌ఖాన్
నేరేడ్‌మెట్, డిసెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలని హెలెన్ కెల్లర్స్ చైర్మన్ పి.ఉమ్మర్‌ఖాన్ అన్నారు. గురువారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా దివ్యాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు రూపొందించిన పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఉమ్మర్‌ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన మానవ ప్రాథమిక హక్కులను ప్రతి ఒక్కరికీ సమానంగా అందజే సే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు విధిగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. ఎన్నికల రోజు ప్రభుత్వం ఇచ్చిన హాలిడే ఇంటి వద్ద కూర్చునేందుకు కాదన్నారు. కాదు ప్రతి బాధ్యత గల పౌరుడు తమ హక్కులతో పాటు తమ కర్తవ్యాలను మరవకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు. మానవ హక్కులను సమానంగా ప్రతి దివ్యాంగ సోదరి, సోదరులకు అందించి వారి అభివృద్ధికి తోడ్పడే బాధ్యత సాటి మానవునిగా ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ హైదరాబాద్ హైటెక్ సిటీ అధ్యక్షుడు సుబ్బ రాజేందర్, హెలెన్ కెల్లర్ ప్రిన్సిపాల్, శశిధర్‌రెడ్డి, ఎం.డి.గౌస్ పాల్గొన్నారు.