అభాగ్యుల పట్ల దాతల సానుభూతి

ABN , First Publish Date - 2020-03-25T10:06:34+05:30 IST

బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌లోని మాతృ దేవోభవ అనాథాశ్రమంలోని అభాగ్యులు వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. కరోనా వైరస్‌ నేపథ్యంలో నిత్యావసర సరుకులు లభించక...

అభాగ్యుల పట్ల దాతల సానుభూతి

  • ‘కరోనా’ విరాళాల అందజేత ఫ శానిటైజర్లు పంపిణీ చేసిన మేయర్‌ 


సరూర్‌నగర్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌లోని మాతృ దేవోభవ అనాథాశ్రమంలోని అభాగ్యులు వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. కరోనా వైరస్‌ నేపథ్యంలో నిత్యావసర సరుకులు లభించక, బియ్యం కొనడానికి డబ్బు లేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆశ్రమం నిర్వాహకుడు గట్టు గిరి సోషల్‌ మీడియాలో పోస్టు చేసి అభాగ్యులను ఆదుకోవాల్సిందిగా కోరారు. మొన్నటి వరకు ఎవరో ఒకరు తమ బర్త్‌డే, మ్యారేజ్‌ డే, తమ కుటుంబ సభ్యుల జయంతి, వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదానం నిర్వహించి, కొంత నగదు సైతం అందజేసేవారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో వారం రోజులుగా ఇక్కడకు వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఆదివారం నుంచి ఒక్కరు కూడా రాలేదు. దీంతో అభాగ్యులకు తిప్పలు తప్పడం లేదు. వారికి కనీసం మాస్కులు, శానిటైజర్లు అందజేసే వారు కూడా కరువయ్యారు. ఈ దృష్ట్యా తమ ఆశ్రమానికి అండగా నిలవాలని గిరి సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.  

  • ఆశ్రమంలోని అభాగ్యుల దుస్థితిని తెలుసుకున్న బాలాపూర్‌కు చెందిన ఇద్దరు యువకులు వెంటనే స్పందించారు. సింగిరెడ్డి చంద్రపాల్‌రెడ్డి అనే యువకుడు రూ.6,666, పన్నాల శ్రీకాంత్‌రెడ్డి రూ. 5,000 నగదును ఆశ్రమం ఖాతాకు పంపించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వారికి గిరి కృతజ్ఞతలు తెలియజేశారు. 
  • తమ ఆశ్రమంలోని అభాగ్యులకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని కోరుతూ బుధవారం నిర్వాహకుడు గిరి బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాతారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఆమె వెంటనే స్పందించి సీపీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తయారు చేయించిన శానిటైజర్లను పంపిణీ చేశారు. ఆశ్రమం వద్ద పారిశుధ్య నిర్వహణ నిమిత్తం బ్లీచింగ్‌ పౌడర్‌ సైతం అందజేశారు. ఇతరత్రా ఇబ్బందులు దూరం చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. 

Read more