పార్లమెంట్‌ భవనాల సముదాయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలి : చెన్నయ్య

ABN , First Publish Date - 2020-12-15T06:33:04+05:30 IST

ఢిల్లీలో కొత్తగా నిర్మించే పార్లమెంట్‌ భవనాల సముదాయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య డిమాండ్‌ చేశారు.

పార్లమెంట్‌ భవనాల సముదాయానికి   అంబేడ్కర్‌ పేరు పెట్టాలి : చెన్నయ్య
సమావేశంలో మాట్లాడుతున్న చెన్నయ్య

పంజాగుట్ట, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో కొత్తగా నిర్మించే పార్లమెంట్‌ భవనాల సముదాయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1లోగల సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌ ప్రాంగణం మధ్యలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆయనకు ఘనమైన నివాళి అవుతుందని, ఆ దిశగా పార్లమెంట్‌ నూతన భవన సముదాయాన్ని డిజైన్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి తదితరులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో మాల మానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌, యూత్‌ అధ్యక్షుడు జి. రమేష్‌, గణేష్‌, రాజ్‌కుమార్‌, లింగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:33:04+05:30 IST