కాచిగూడ నుంచి న్యూగువాహటికి పార్సిల్ రైలు
ABN , First Publish Date - 2020-06-22T10:02:32+05:30 IST
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అస్సోంలోని న్యూగువాహటికి డిసెంబర్ 27 వరకు ప్రతి ఆదివారం 12 పార్సిల్ బోగీలతో రైలు

బర్కత్‌పుర, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అస్సోంలోని న్యూగువాహటికి డిసెంబర్ 27 వరకు ప్రతి ఆదివారం 12 పార్సిల్ బోగీలతో రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 8గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరింది. మంగళవారం ఈ రైలు న్యూగువాహటి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. లగేజీని దింపి అదే రోజు రాత్రి 8 గంటలకు తిరిగి బయలుదేరి గురువారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది.