రెండేళ్ల పాటు యువతితో సహజీవనం

ABN , First Publish Date - 2020-05-24T10:34:11+05:30 IST

ప్రేమ పేరుతో రెండేళ్లు సహజీవనం చేసి, కొడుకు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు

రెండేళ్ల పాటు యువతితో సహజీవనం

కొడుకు పుట్టాక ముఖం చాటేసిన యువకుడు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు


పంజాగుట్ట, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో రెండేళ్లు సహజీవనం చేసి, కొడుకు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరానికి చెందిన యువతి(20)కి చిన్నతనంలో తల్లి, రెండేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. యువతి హెల్పర్‌గా పనిచేస్తూ సోదరుడితో కలిసి ఉంటోంది.


వీరు నివాసముంటున్న బిల్డింగ్‌ పెంట్‌హౌ్‌సలో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి తండా ప్రశాంత్‌(23) ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని యువతిని తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. దీంతో అతడిని నమ్మిన యువతి గర్భం దాల్చి మే 21న నిలోఫర్‌ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. ఆమె పెళ్లి చేసుకోమని కోరగా తనకు బిడ్డకు సంబంధంలేదంటూ ప్రశాంత్‌ ముఖం చాటేశాడు. బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-24T10:34:11+05:30 IST