అంతా వారిష్టం...!

ABN , First Publish Date - 2020-09-18T09:15:13+05:30 IST

మణికొండ మున్సిపాలిటీలో పందెన్‌వాగు నిత ్యం ప్రవహించే వరదనీటి కాల్వ. జూబ్లీహిల్స్‌లోని దుర్గం చెరువు, ఖాజాగూడ

అంతా వారిష్టం...!

నాలాను ఎటైనా మళ్లిస్తారు... 

ఎన్ని వంతెనలు అయినా వేసుకుంటారు...

ప్రతి వర్షాకాలంలో ముంచెత్తుతున్న పందెన్‌వాగు 


నార్సింగ్‌, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి) : మణికొండ మున్సిపాలిటీలో పందెన్‌వాగు నిత ్యం ప్రవహించే వరదనీటి కాల్వ. జూబ్లీహిల్స్‌లోని దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు, మణికొండ ఎల్లమ్మ చెరువు, రాయదుర్గంలోని మల్కం చెరువు ఇవి గొలుసుకట్టు చెరువులు. ఈ చెరువులలోని మిగులు నీరు, వరదనీరు ఈ పెందెన్‌వాగు ద్వారా మణికొండ, పుప్పాల్‌గూడ, నెక్‌న్నాంపురా మీదుగా తారామతి బారాదరి వద ్ద మూసీ నదిలో కలుస్తుంది. ప్రతి ఏడాది దాదాపు రెండు టీఎంసీలకు పైగా నీరు ఈ కాల్వ ద్వారా మూసీలోకి వెళుతుందని ఒక అంచనా. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ పందెన్‌వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగును చూస్తే చిన్న సైజు నదిలా కనిపిస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ వాగు దాదాపు 50 కాలనీలను నీట ముంచుతుంది. ఈ వర్షాకాలంలోను అదే చేసింది. కాల్వ బారిన పడకుండా మంత్రిగా ఉన్న హరీష్‌రావు అప్పట్లో కొన్ని పనులు చేయించారు. ఈ కాల్వ బాధితుల్లో ఆంధ్రాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే, ఓ దర్శక దిగ్గజం కూడా ఉన్నారు.


ప్రస్తుతం ఈ పందెన్‌ వాగు ప్రమాదకర పరిస్థితులలో చిక్కుకుంది. ఈ పందెన్‌వాగు ప్రారంభమయ్యే మల్కం చెరువు నుంచి హరివిల్లు వరకు ఉన్న ఈ నాలాను ఇష్టానుసారంగా మలుపులు తిప్పారు.  అంతేకాకుండా ప్రతి పది అడుగులకు కొందరు నాలా దాటేందుకు సొంత వంతెనలు నిర్మించుకున్నారు. మల్కంచెరువు నుంచి  హరివిల్లు వరకు ఈ పందెన్‌వాగును చూస్తే ఎంత ఘోరంగా వంతెనలు నిర్మించారో అర్థం అవుతుంది.  వాగులపై వంతెనలు ఎవరైనా నిర్మించాలంటే ఇరిగేషన్‌ శాఖ నుంచి అనుమతి తీసుకుని నిర్మించాలి. కానీ, ఇక్కడ ఆ నిబంధనలు తుంగలో తొక్కారు.  రెండు నెలల క్రితం ఓ పెద్ద మనిషి పైపుల ద్వారా వంతెన ఏర్పాటు చేసుకున్న సమయంలో స్థానిక పంచవటి కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఇరిగేషన్‌శాఖ అధికారులు వెంటనే కూలుస్తామని ప్రకటించారు. అది ఇప్పటి వరకు అమలు కాలేదు. 


మల్కంచెరువు నుంచి హరివిల్లు వరకు ఈ పందెన్‌ వాగు ఒకపక్క మణికొండ మున్సిపాలిటీ కాగా, మరోపక్క జీహెచ్‌ఎంసీలోని శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో అధికభాగం శేరిలింగంపల్లి సర్కిల్‌ వారిదే. మరి ఆ అధికారులు ఏం చేస్తున్నారో అర్థంకాదు.  ఆ ప్రాంతంలో ఉండే కొందరు ఫ్యాబ్రికేటెడ్‌ వంతెన నిర్మిస్తే, మరికొందరు పైపులతో,  ఇంకొందరు సిమెంట్‌ దిమ్మెలతో ఇష్టానుసారం నిర్మించారు. ఇందులో కొన్ని వంతెనలు వరద ఉధృతికి కూలిపోయాయి. మల్కం చెరువు నుంచి హరివిల్లు వరకు పందెన్‌వాగుకు రెండు వైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించేందుకు మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ వారు అంచనాలు వేసినా ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. మరోపక్క జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి అధికారులు ఈ నాలా పొడవునా వంద అడుగుల రోడ్డును ప్రతిపాదించారు. రోడ్డు మార్కింగ్‌లో వచ్చే ఇళ్లకు నోటీసులు కూడా ఇచ్చారు. అయినా వారు పనులు ప్రారంభించలేదు. ఇక్కడి అక్రమాలను పట్టించుకోలేదు.

Updated Date - 2020-09-18T09:15:13+05:30 IST