కామినేని ఫ్లైఓవర్‌ కింద ఆక్సిజన్‌ పార్కు: సుధీర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-17T09:51:19+05:30 IST

ఎల్‌బీనగర్‌లోని కామినేని ఫ్లైఓవర్‌ కింద 390 మీటర్ల పొడవులో ఆక్సిజన్‌ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ఎల్‌బీనగర్‌ ఎమ్మె

కామినేని ఫ్లైఓవర్‌ కింద ఆక్సిజన్‌ పార్కు: సుధీర్‌రెడ్డి

మన్సూరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌బీనగర్‌లోని కామినేని ఫ్లైఓవర్‌ కింద 390 మీటర్ల పొడవులో ఆక్సిజన్‌ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ఎల్‌బీనగర్‌ ఎమ్మె ల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, మార్నింగ్‌ వాక్‌లో భాగంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, మన్సూరాబాద్‌ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి బుధవారం ఉదయం కామినేని ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. గతంలో ఎక్కడా లేని విధంగా ఆక్సిజన్‌ పార్కును ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాసా గుర్తించిన ఆక్సిజన్‌ అధిక మొత్తంలో విడుదల చేసే మొక్కలను తీసుకొచ్చి ఫ్లైఓవర్‌ కింద నాటుతామని, తీగ పారే మొక్కలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే డిసెంబర్‌ లేదా మార్చి వరకు పార్కు పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీ విజయకృష్ణ, ఈఈ రాజయ్య, ఏఈ వెంకటేశం పాల్గొన్నారు.

Updated Date - 2020-09-17T09:51:19+05:30 IST