ఒక వార్డులో మాత్రమే పోటీకి అవకాశం
ABN , First Publish Date - 2020-11-13T08:55:24+05:30 IST
గ్రేటర్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక వార్డులో మాత్రమే పోటీ చేసే అవకాశముంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్ దాఖలు చేసే అవకాశముంది. ఉపసంహరణ గడువులోపు అతడి ఆసక్తి ఉన్న
ఎక్కువ వార్డుల్లో నామినేషన్లు ఉంటే అనర్హులే..
హైదరాబాద్ సిటీ, నవంబర్ 12 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక వార్డులో మాత్రమే పోటీ చేసే అవకాశముంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్ దాఖలు చేసే అవకాశముంది. ఉపసంహరణ గడువులోపు అతడి ఆసక్తి ఉన్న వార్డు మినహా ఇతర వార్డుల్లోని నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్ దాఖలై ఉంటే, ఆ నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకోవొద్దని, ఆ వ్యక్తిని ఏ వార్డులో పోటీ చేసేందుకు అనుమతివ్వవద్దని కమిషనర్ లోకేష్‌కుమార్ ఆదేశించారు.
ఈసీ ఆదేశాల మేరకు సర్కిళ్ల వారీగా ఎన్నికల సహాయ వ్యయ పరిశీలకులను నియమించాలని జిల్లా ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. రాష్ట్ర ట్రెజరీ, ఆడిట్, ఆర్థిక విభాగం అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఈసీ జీహెచ్‌ఎంసీకి సూచించింది.