సైదాబాద్‌లో ఒకరికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-03-25T09:56:13+05:30 IST
సైదాబాద్ పూర్ణోదయ కాలనీలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలియడంతో కలకలం రేగింది. లండన్ నుం చి వచ్చిన యువకుడు...

- అపమత్తమైన యంత్రాగం
సైదాబాద్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): సైదాబాద్ పూర్ణోదయ కాలనీలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలియడంతో కలకలం రేగింది. లండన్ నుం చి వచ్చిన యువకుడు(30)కి పాజిటివ్ అని తేలడంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ అధికారులు వంద మంది గల ఎంటమాలజీ బృందాన్ని రం గంలో దించారు. కాలనీ పరిసర ప్రాంతాలలో రసాయనా లు స్ర్పే చేశారు. వైద్య బృందాలు కాలనీతో పాటు సమీప ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ రజినీకాంత్ రెడ్డి, అలివేలు మంగతాయారు పాల్గొన్నారు.