సెప్టెంబర్‌ 15 వరకు ఆఫర్‌

ABN , First Publish Date - 2020-08-11T09:57:44+05:30 IST

నీటి బకాయిలు పెండింగ్‌ ఉన్న వారికోసం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ను అమలు చేస్తున్నట్లు జలమండలి మేనేజర్‌ త్రినాథ్‌రావు

సెప్టెంబర్‌ 15 వరకు ఆఫర్‌

కేపీహెచ్‌బీకాలనీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నీటి బకాయిలు పెండింగ్‌ ఉన్న వారికోసం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ను అమలు చేస్తున్నట్లు జలమండలి మేనేజర్‌ త్రినాథ్‌రావు తెలిపారు. జలమండలి ఎండీ దానకిషోర్‌ ఆదేశాల మేరకు సోమవారం కేపీహెచ్‌బీకాలనీలో ఆఫర్‌ అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందన్నారు. కాల పరిమితిలోపు బకాయిలు చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తామని తెలిపారు.

Updated Date - 2020-08-11T09:57:44+05:30 IST