నాన్ లోకల్..!
ABN , First Publish Date - 2020-11-27T06:08:49+05:30 IST
చంటిగాడు.. లోకల్ అని తిరిగే ఓ నేత ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు.

ఉండేది ఒక డివిజన్‌లో.. పోటీ మరో చోట
మొత్తం అభ్యర్థుల్లో 25 మంది స్థానికేతరులే..
హైదరాబాద్ సిటీ, నవంబర్ 26 (ఆంధ్రజ్యోతి): చంటిగాడు.. లోకల్ అని తిరిగే ఓ నేత ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. రిజర్వేషన్ అనుకూలించకనో.. మరో కారణం వల్లో తానుండే డివిజన్‌లో కాకుండా మరో డివిజన్‌లో పోటీ చేస్తున్నాడు. గ్రేటర్ బరిలో ఇలా తాము నివసించే డివిజన్ కాకుండా ఇతర డివిజన్ల నుంచి పోటీ చేస్తున్న వారు వందల్లో ఉన్నారు. వారిలో గుర్తింపు లేని పార్టీలు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి మొత్తం 445 మంది పోటీలో ఉండగా, 25 మంది ఇతర డివిజన్లకు చెందిన వారే ఉన్నారు. మొత్తం 150 డివిజన్లలోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులుండగా, నవాబ్‌సాబ్ కుంట మినహా మిగతా అన్ని స్థానాల్లో బీజేపీ, 146 స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
స్థానికులు కానివారు..
డివిజన్ నెంబర్-9 రామంతాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి టి.సౌమ్య, డివిజన్ నెంబర్-35 గౌలిపురా డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రి, డివిజన్ నెంబర్-43, చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేస్తున్న అఫ్జల్, డివిజన్ నెంబర్-57 సులేమాన్ నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సరితామహేశ్ వేరే డివిజన్‌లో నివాసం ఉంటున్నారు. డివిజన్ నెంబర్-68 టోలీచౌకి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏ.నాగజ్యోతి, డివిజన్ నెంబర్-69, నానల్‌నగర్ బీజేపీ అభ్యర్థి కరుణ్ కామ్లేకర్, డివిజన్ నెంబర్-82 గోల్నాక డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి దూసరి లావణ్య, డివిజన్ నెంబర్-84 బాగ్ అంబర్‌పేట్ డివిజన్ బీజేపీ అభ్యర్థి బి.పద్మావతి రెడ్డి, డివిజన్ నెంబర్-123 హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బొల్లేపల్లి సీతారామరాజు, డివిజన్ నెంబర్-125 గాజులరామారం డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రావుల శేషగిరి పోటీ చేసే డివిజన్‌లో నివసించరు. డివిజన్ నెంబర్-128 చింతల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రషీదాబేగం, డివిజన్ నెంబర్-142 అడ్డగుట్ట డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ కాంతి కుమారి తదితరులు స్థానికంగా నివసించరు. ఇంకా పలువురు అభ్యర్థులు కూడా స్థానికంగా నివసించరని సమాచారం.
Read more