జీహెచ్‌ఎంసీ ఉచిత భోజన కేంద్రాల వద్ద జాగ్రత్తలు నిల్‌

ABN , First Publish Date - 2020-03-28T08:49:16+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ పాటించాలని, సామాజిక దూరం తప్పనిసరని పదే పదే ప్రకటిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం...

జీహెచ్‌ఎంసీ ఉచిత భోజన కేంద్రాల వద్ద జాగ్రత్తలు నిల్‌

సికింద్రాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ పాటించాలని, సామాజిక దూరం తప్పనిసరని పదే పదే ప్రకటిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం తాను మాత్రం కొవిడ్‌ జాగ్రత్తలకు తిలోదకాలిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. నిత్యావసర సరుకుల కొనుగోలు సందర్భంగా కిరాణా దుకాణాలు, మార్కెట్లలో సామాజిక దూరం పాటించాలని చెబుతున్న అధికారులు.. జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న  ఉచిత భోజన కేంద్రాల వద్ద ముందస్తు జాగ్రత్తలను విస్మరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ ఆయా కేంద్రాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని పలువురు అంటున్నారు. నగరంలో నిరుపేదలు, యాచకులను ఆదుకునేందుకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు కొవిడ్‌ జాగ్రతలు తీసుకుంటున్నాయి. ప్రజల మధ్య సామాజిక దూరం ఉండేలా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తుండడంపై పలువురు అభినందిస్తున్నారు.

Updated Date - 2020-03-28T08:49:16+05:30 IST