నిమ్స్‌ నియామకాల్లో అవకతవకలు?

ABN , First Publish Date - 2020-12-10T06:31:39+05:30 IST

నిమ్స్‌ ఆస్పత్రికి సంబంధించి గత ఏడాది వివిధ మాధ్యమాలలో వచ్చిన కథనాలకు స్పందించి విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయం అర్థం కావడం లేదని తెలంగాణ నిరుద్యోగ సంఘర్షణ సమితి ప్రతినిధులు ఆరోపించారు.

నిమ్స్‌ నియామకాల్లో అవకతవకలు?

నిరుద్యోగ సంఘర్షణ సమితి ప్రతినిధుల ఆరోపణ


హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి):
నిమ్స్‌ ఆస్పత్రికి సంబంధించి గత ఏడాది వివిధ మాధ్యమాలలో వచ్చిన కథనాలకు స్పందించి విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయం అర్థం కావడం లేదని తెలంగాణ నిరుద్యోగ సంఘర్షణ సమితి ప్రతినిధులు ఆరోపించారు. గత ఏడాది ఎంపికైన మధుమోహన్‌ అనే వ్యక్తిని శాస్త్రవేత్తగా నియమించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించే ప్రయత్నం చేయగా అతడి స్థానికత వివరాలపై సమాధానం రాలేదన్నారు. దీంతో నిమ్స్‌ డైరెక్టర్‌ను ప్రశ్నించగా.. అసలు నియామకమే జరగలేదన్నారని పేర్కొన్నారు. సదరు వ్యక్తికి సంబంధించిన డైరెక్టర్‌ సంతకం చేసిన నియామక పత్రం, లక్షన్నర జీతం అందుకుంటున్నట్లు పేస్లి్‌పలు సేకరించారు. నిమ్స్‌లో లేని పోస్టు సృష్టించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయకుండా, విదేశాలలో విద్యనభ్యసించిన ఆధారాలు తీసుకోకుండా, అసలు అతడి సర్టిఫికెట్లు తీసుకోకుండా కేవలం బయోడేటా ఆధారంగా  ఎంపిక చేశారని ఆరోపించారు. సదరు అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో గవర్నర్‌, సంబంధిత మంత్రి, చీఫ్‌ సెక్రటరీ, ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, నిమ్స్‌లో వివిధ విభాగాధిపతులకు వినతిపత్రం ఇచ్చినట్లు సమితి సభ్యులు తెలిపారు.

Updated Date - 2020-12-10T06:31:39+05:30 IST