రెడ్డి కాలనీలో విషాద ఛాయలు

ABN , First Publish Date - 2020-02-12T09:26:00+05:30 IST

స్నేహితులతో కలిసి కేంద్ర పాలితప్రాంతమైన పాండిచ్చేరికి విహారయాత్రకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయిన కుషాయిగూడ వాసి నిఖిల్‌రెడ్డి(22) ఆచూకీ ఇంకా లభించలేదు.

రెడ్డి కాలనీలో విషాద ఛాయలు

కుటుంబ సభ్యులను పరామర్శించిన మేయర్‌ సతీమణి బొంతు శ్రీదేవి


కుషాయిగూడ, ఫిబ్రవరి11 (ఆంధ్రజ్యోతి) : స్నేహితులతో కలిసి కేంద్ర పాలితప్రాంతమైన పాండిచ్చేరికి విహారయాత్రకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయిన కుషాయిగూడ వాసి నిఖిల్‌రెడ్డి(22) ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో కుషాయిగూడ సాయినగర్‌, చక్రిపురం రెడ్డి కాలనీలలో విషాద ఛాయలు అ లుముకున్నాయి. సమాచారం అందిన వెం టనే మృతుడి కజిన్‌ సోదరుడు కమలాకర్‌ రెడ్డితో పాటు మరో ఇద్దరు దగ్గరి బంధువులు పాండిచ్చేరికి బయలుదేరి వెళ్లారు. కొట్టకుప్పం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిన్న మొదలియార్‌ చావిడీ బీచ్‌లో నిఖిల్‌ రెడ్డితో పాటు మరో 9 మంది స్నేహితులు సరదా గా గడుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


నిఖిల్‌తో పాటు వంశీ అలల తాకిడికి కొట్టుకుపోతుండగా వంశీని కాపాడాం కానీ.. నిఖిల్‌ను రక్షించలేకపోయామని స్నేహితులు పోలీసుల వద్ద వాపోయినట్లు సమాచారం. మృ తదేహం ఒడ్డుకు కొట్టుకు రావడానికి కనీసం మూడు రోజులైనా పడుతుందని అక్కడి పోలీసులు పేర్కొంటున్నారని తెలిసింది. నిఖిల్‌ మృ తదేహాన్ని గుర్తించేందుకు తెలుగువాడైన అక్కడి జిల్లా ఎస్పీ రాహుల్‌ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని వారు తెలిపారు. సత్వర సహాయక చర్యల కోసం చర్లపల్లి కార్పొరేటర్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన సతీమణి బొంతు శ్రీదేవి మంగళవారం నిఖిల్‌రెడ్డి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

Updated Date - 2020-02-12T09:26:00+05:30 IST