హైదరాబాద్‌లో కొత్త నిబంధన అమల్లోకి.. కరోనా వస్తే..

ABN , First Publish Date - 2020-07-15T12:53:59+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. వైరస్‌ నియంత్రణ, హోం ఐసొలేషన్‌లో ఉంటోన్న

హైదరాబాద్‌లో కొత్త నిబంధన అమల్లోకి.. కరోనా వస్తే..

మళ్లీ.. వీధి కట్టడి..!

కరోనా విజృంభణ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ నిర్ణయం 


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. వైరస్‌ నియంత్రణ, హోం ఐసొలేషన్‌లో ఉంటోన్న వారికి వైద్యసేవలు అందేలా, పౌరులు వైరస్‌ బారిన పడకుండా బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లోంది. ఇందులో భాగంగా కేసుల అధికంగా నమోదవుతోన్న ఎనిమిది సర్కిళ్లను హైరిస్క్‌ ఏరియాలుగా గుర్తించింది. ఆయా సర్కిళ్లకు నోడల్‌ ఆఫీసర్లను నియమించింది. 


లాక్‌డౌన్‌ సమయంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రాంతాల వారీగా కట్టడి చేశారు. కేసుల సంఖ్యను బట్టి 100 నుంచి  200 మీటర్లు, అంతకంటే ఎక్కువ పరిధిని కట్టడి ప్రాంతంగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో బస్తీలు, కాలనీలు కూడా గతంలో కట్టడి ప్రాంతాలుగా ఉండేవి. ఇప్పుడు పాజిటివ్‌ వచ్చిన ఇంటినే కట్టడి చేస్తున్నారు. అయితే, ఇది పూర్తిస్థాయిలో సత్ఫలితాలనివ్వలేదు. దీంతో కేసుల సంఖ్యను బట్టి కట్టడిని వీధి వరకు పెంచుతున్నారు. ఒక గల్లీలోని నాలుగైదు భవనాల్లో పాజిటివ్‌ కేసులు నమోదైతే.. ఆ గల్లీలో రాకపోకలకు వీలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అంబర్‌పేట పటేల్‌నగర్‌లో ఓ వీధిలో ఇటీవల పూర్తి కట్టడి చేశారు. 


హైరిస్క్‌ సర్కిళ్లు - నోడల్‌ అధికారులు....

సర్కిల్‌ నోడల్‌ అధికారి

మెహదీపట్నం జె. శంకరయ్య (అదనపు కమిషనర్‌)

కార్వాన్‌ బి. సంధ్య (జాయింట్‌ కమిషనర్‌)

యూసుఫ్‌గూడ కె. యాదగిరిరావు (అదనపు కమిషనర్‌)

చాంద్రాయణగుట్ట ఏ. విజయలక్ష్మి (అదనపు కమిషనర్‌)

చార్మినార్‌ పీఎస్‌ రాహుల్‌రాజ్‌ (అదనపు కమిషనర్‌)

కుత్బుల్లాపుర్‌ ప్రియాంక ఆల (జోనల్‌ కమిషనర్‌)

రాజేంద్రనగర్‌ బదావత్‌ సంతోష్‌ (అదనపు కమిషనర్‌)

అంబర్‌పేట జయరాజ్‌ కెనడి (అదనపు కమిషనర్‌)

Updated Date - 2020-07-15T12:53:59+05:30 IST