వాటర్‌బోర్డులో 29 మంది కొత్త మేనేజర్లు
ABN , First Publish Date - 2020-12-30T06:30:10+05:30 IST
వాటర్‌బోర్డులో కొత్తగా 29 మంది అభ్యర్థులు మేనేజర్లుగా ఎంపికయ్యారు. వారికి ఎండీ దానకిషోర్ మంగళవారం నియామకపత్రాలను అందజేశారు.

హైదరాబాద్
సిటీ, డిసెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): వాటర్‌బోర్డులో కొత్తగా 29 మంది
అభ్యర్థులు మేనేజర్లుగా ఎంపికయ్యారు. వారికి ఎండీ దానకిషోర్ మంగళవారం
నియామకపత్రాలను అందజేశారు. వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో టెక్నికల్
గ్రేడ్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, జీపీఈ (జనరల్ పర్పస
ఎంప్లాయీస్) వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంటర్నల్
పదోన్నతులు కల్పించడానికి ఇటీవల జేఎన్టీయూతో కలిసి పరీక్షలు నిర్వహించారు.
పరీక్షలకు 69 మంది హాజరుకాగా, 29 మంది మేనేజర్ పోస్టులకు అర్హత సాధించారు.
ఉత్తీర్ణత సాధించిన వారికి వారం రోజుల ట్రైనింగ్ అనంతరం పోస్టింగ్
ఇవ్వాలని సంబంధిత అధికారులను ఎండీ ఆదేశించారు. కార్యక్రమంలో డైరెక్టర్
పర్సనల్ డి. శ్రీధర్‌బాబు, పీ అండ్ ఏ సీజీఎం మహ్మద్ అబ్దుల్ ఖాదర్,
వాటర్‌వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ ప్రెసిడెంట్
జి.రాంబాబుయాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్లు కె.రాజ్ రెడ్డి, మహమ్మద్
జహంగీర్, జనరల్ సెక్రటరీ బి. జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.