నూతన విద్యావిధానం 2020 రోడ్‌మ్యాప్ కమిటీలో డాక్టర్ ప్రవీణ్‌రావుకు చోటు
ABN , First Publish Date - 2020-09-12T09:44:34+05:30 IST
వ్యవసాయ ఉన్నత విద్యలో నూతన విద్యావిధానం 2020 అమలుకు రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ఏర్పాటు అయిన ..
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ ఉన్నత విద్యలో నూతన విద్యావిధానం 2020 అమలుకు రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ఏర్పాటు అయిన జాతీయ కమిటీలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావుకు చోటు దక్కింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐకార్) ఈ కమిటీని నియమించింది. మొత్తం 10మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. నూతన విద్యావిధానం అమలుకు అనుసరించాల్సిన రోడ్‌మ్యా్‌పను ఈ కమిటీ ఐకార్‌కు సూచిస్తుంది. అలాగే రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ఈ విధానం అములుకు ఏయే చర్యలు తీసుకోవాలి తదితర విషయాలను కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది.