ఎన్‌బీటీనగర్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-12-01T16:23:50+05:30 IST

ఎన్‌బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుం

ఎన్‌బీటీనగర్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: ఎన్‌బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.  కాషాయం రంగు  మాస్కులు పెట్టుకొని పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారని టీఆర్ఎస్ వర్గీయులు... చేతికి గులాబీ రంగు కంకణాలు కట్టుకుని వచ్చారంటూ బీజేపీ వర్గీయులు వాగ్వాదానికి ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగారు.  బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి గులాబీ కండువాలతో పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఇదేమిటి అంటూ బీజేపీ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీస్ స్టేషన్ సమీపంలోని పోలింగ్ స్టేషన్లు 43, 44, 45, 46, 47, 48, 49, వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

Updated Date - 2020-12-01T16:23:50+05:30 IST