నేడు జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2020-02-08T09:47:40+05:30 IST

రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు పరిధిలోని అన్ని కోర్టులలో జాతీయ ..

నేడు జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఫిబ్రవరి7 (ఆం ధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు పరిధిలోని అన్ని కోర్టులలో జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పలవురు కక్షిదారుల పరస్పర అంగీకారంతో కేసులను అక్కడికక్కడే పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ, మోటార్‌ వాహన, బ్యాంక్‌ తదితర కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయా కేసుల కక్షిదారులను ఉదయ్‌ కుమార్‌ కోరారు. 

Updated Date - 2020-02-08T09:47:40+05:30 IST