ఆకట్టుకున్న ‘నర్తన రవళి’

ABN , First Publish Date - 2020-10-27T10:05:07+05:30 IST

‘కళానృత్య నికేతన్‌’ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 23, 24, 25 తేదీల్లో మూడు రోజులపాటు వర్చువల్‌గా జరిగిన ‘నర్తన రవళి - 2020’ కార్యక్రమం వీక్షకులను ఆనందింపజేసింది.

ఆకట్టుకున్న ‘నర్తన రవళి’

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): ‘కళానృత్య నికేతన్‌’ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 23, 24, 25 తేదీల్లో మూడు రోజులపాటు వర్చువల్‌గా జరిగిన ‘నర్తన రవళి - 2020’ కార్యక్రమం వీక్షకులను ఆనందింపజేసింది. కళానృత్య నికేత న్‌ డైరెక్టర్‌ బిందు అభినయ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆకాడమీకి చెందిన నృత్యకళాకారులే కాకుండా ఇతర రాష్ట్రాలు, ప్రవాస భారతీయ కూచిపూడి నృత్యకారిణులు పాల్గొని ప్రసంశా పత్రాలు అందుకున్నారు. శ్రుతి మా నస (విజయవాడ), పూజ ప్రణవి (కెనడా), మనీష రాగుల (కొత్తగూడెం), అనన్య యెర్నేని, తాన్వి తోట (అమెరికా), పరిమళ హరిప్రియ (రాజమండ్రి), కీర్తనబొర్రా (హైదరాబాద్‌), తదితరులు తమ అద్భుత నాట్య ప్రదర్శనతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. 

Updated Date - 2020-10-27T10:05:07+05:30 IST