నాలా నిర్మాణంలో నాణ్యత లోపం
ABN , First Publish Date - 2020-12-31T04:53:56+05:30 IST
నాలా పనుల్లో నాణ్యత లోపించింది. కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నిర్మిస్తుండటంతో పనులను ఆపేయాలని కార్పొరేటర్ సూచించారు.

పనులను ఆపేయాలని కాంట్రాక్టర్‌కు కార్పొరేటర్ సూచన
బంజారాహిల్స్, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): నాలా పనుల్లో నాణ్యత లోపించింది. కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నిర్మిస్తుండటంతో పనులను ఆపేయాలని కార్పొరేటర్ సూచించారు. వెంకటేశ్వరనగర్ కాలనీ డివిజన్ సింగాడిబస్తీ సివరేజీ నాలా పై కప్పు నిర్మాణ పనుల కోసం గ్రేటర్ ఎన్నికలకు ముందు నిధులు మంజూరు అయ్యాయి. పనులు ఇటీవల మొదలుపెట్టారు. నాలా పై బెడ్డు కోసం ఉపయోగిస్తున్న నిర్మాణ పదార్ధాల్లో నాణ్యత కొరవడిందని బస్తీ వాసులు కార్పొరేటర్ మన్నెకవితారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా బుధవారం పరిశీలించారు. ఇసుకలో నాణత్య లేకపోవడంతో పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.