నటుడు నాగశౌర్యపై హెచ్చార్సీలో ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-02-08T08:55:32+05:30 IST
డ్రైవర్ల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీనటుడు నాగశౌర్యపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ట్యాక్సీ డ్రైవర్స్ జాయింట్ ..

ఆబిడ్స్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): డ్రైవర్ల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీనటుడు నాగశౌర్యపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ట్యాక్సీ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది. ఈ నెల 3న ఓ టీవీ చానల్ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్న నాగశౌర్య రిపోర్టర్ జాఫర్ ‘అశ్వత్థామ’ సినిమాపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ... డ్రైవర్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ ఆరోపించారు. డ్రైవర్లు చదువురాని వారు, తాగుబోతులు అని అర్థం వచ్చేలా మాట్లాడారన్నారు. నాగశౌర్య చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అతడిపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని కోరారు.