జలం..పుష్కలం..

ABN , First Publish Date - 2020-11-03T09:22:32+05:30 IST

నగరానికి నాగార్జున్‌సాగర్‌ ప్రాజెక్టులోని అక్కంపల్లి నుంచి కృష్ణా జలాలను, కాళేశ్వరం ఎగువన గల ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను రోజూ తరలిస్తున్నారు

జలం..పుష్కలం..

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): నగరానికి నగరానికి నాగార్జున్‌సాగర్‌ ప్రాజెక్టులోని అక్కంపల్లి నుంచి కృష్ణా జలాలను, కాళేశ్వరం ఎగువన గల ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను రోజూ తరలిస్తున్నారులోని అక్కంపల్లి నుంచి కృష్ణా జలాలను, కాళేశ్వరం ఎగువన గల ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను రోజూ తరలిస్తున్నారు. వీటితో పాటు జంట జలాశయాలైన ఉస్మాన్‌ సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌, సింగూరు, మంజీర ప్రాజెక్టుల నుంచి నగరానికి నీటిని తరలిస్తున్నారు. రెండేళ్లుగా అధికంగా కృష్ణా, గోదావరి జలాలను మాత్రమే సరఫరా చేస్తుండగా, గండిపేట, హిమాయత్‌సాగర్‌ల నుంచి నీళ్లు సక్రమంగా వినియోగించలేదు. సింగూరు, మంజీర జలాలు రెండేళ్ల క్రితమే బంద్‌ అయ్యాయి. నెల రోజుల క్రితం వరకు నగరానికి రోజూ కేవలం 2050 మిలియన్‌ లీటర్ల కృష్ణా, గోదావరి నీళ్లను మాత్రమే సరఫరా చేశారు. భారీ వర్షాలతో జలశయాలకు కళ సంతరించుకుంది.


పొదుపుగా వాడేందుకు వాటర్‌బోర్డు ప్రణాళికలు

ప్రస్తుతం నగరానికి సమీపంలోని జలాశయాల నుంచి సమృద్ధిగా నీటిని వాడేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా సింగూరు, మంజీరా ప్రాజెక్టుల నుంచి కనీసం 300 మిలియన్‌ గ్యాలన్ల నీటిని నగరానికి తరలిస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ నుంచి ఒక స్థాయి వరకు నీటిని తరలించి ఆ తర్వాత తాత్కాలికంగా నగరానికి సరఫరా చేయాలని భావిస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాల తరలింపులో ఇబ్బందులు తలెత్తితే అత్యవసరంగా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల నుంచి పెద్దఎత్తున నీటిని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా నీటిని పొదుపుగా వినియోగించడానికి ఏడాది ప్రణాళికను రూపొందించి అందుకనుగుణంగా నగరానికి మెరుగ్గా నీటి సరఫరా చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.


రోజూ 2,350 మిలియన్‌ లీటర్లు

ఒకనాడు మహా నగర దాహార్తి తీర్చిన జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పదేళ్లుగా వట్టిపోయాయి. కొన్నాళ్లుగా వర్షాలు కురిసినా వాటి పరిధిలో నీటి మట్టాలు పెరగలేదు. అడపాదడపా ఆయా జలాశయాల నుంచి నీళ్లను నగర అవసరాలకు వినియోగించారు. ఇటీవల కురిసిన వర్షాలతో అవి నిండుకుండలా మారాయి. హిమాయత్‌సాగర్‌ గేట్లను ఎత్తి ఏకంగా 4,39,820 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సింగూరు, మంజీరా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఆయా జలాశయాలు నిండుకుండలా మారడంతో ప్రస్తుతం నగరానికి సింగూరు, మంజీరా జలాశయాలను తరలిస్తున్నారు. దీంతో రోజూ కనీసం 2350 మిలియన్‌ లీటర్ల వరకు నీళ్లు సరఫరా చేస్తున్నారు.

Updated Date - 2020-11-03T09:22:32+05:30 IST