కిమ్స్‌ ఆస్పత్రికి ఎన్‌ఏబీహెచ్‌ సర్టిఫికెట్‌

ABN , First Publish Date - 2020-09-25T07:22:58+05:30 IST

కిమ్స్‌ ఆస్పత్రి అత్యవసర విభాగానికి ప్రతిష్టాత్మకమైన సర్టిఫికెట్‌ వచ్చింది. నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌

కిమ్స్‌ ఆస్పత్రికి ఎన్‌ఏబీహెచ్‌ సర్టిఫికెట్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): కిమ్స్‌ ఆస్పత్రి అత్యవసర విభాగానికి ప్రతిష్టాత్మకమైన సర్టిఫికెట్‌ వచ్చింది. నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌(ఎన్‌ఏబీహెచ్‌) అనే సంస్థ ఈ సర్టిఫికెట్‌ను అందించింది. తెలంగాణలో అత్యవసర వైద్య సేవల విభాగానికి ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు సర్టిఫికెట్‌ పొందిన మొదటి ఆస్పత్రిగా కిమ్స్‌ నిలిచిందని ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భాస్కర్‌రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అత్యవసర, క్వాలిటీ విభాగాల సిబ్బందిని ఆయన అభినందించారు. సేవల నాణ్యతకు ఈ సర్టిఫికేషన్‌ ఒక గీటురాయిగా ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2020-09-25T07:22:58+05:30 IST