అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-05-18T09:10:45+05:30 IST
నియోజకవర్గంలో, ముఖ్యంగా జియాగూడలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ..

మెహిదీపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో, ముఖ్యంగా జియాగూడలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సూచించారు. ఆదివారం ఆయన పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జియాగూడలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.