అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2020-12-13T05:45:43+05:30 IST

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతిచెందిన సంఘటన మియాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి

మియాపూర్‌, డిసెంబర్‌ 12(ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతిచెందిన సంఘటన మియాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హఫీజ్‌పేట ప్రేమ్‌నగర్‌ ఎ-బ్లాక్‌లో మంజల రాములు(65) కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. కూతురికి వివాహం అయినప్పటికీ  భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పుట్టింట్లోనే  ఉంటుంది. ఈ నెల 11న రాత్రి 8.30గంటల సమయంలో రాములుకు అతని భార్యకు మధ్య గొడవ జరిగింది. దీంతో వారి కుమార్తె మంగమ్మ ఇంటి బయట పడుకుంది. మరుసటి రోజు ఉదయం తండ్రిని నిద్రలేపేందుకు కుమార్తె వెళ్లగా అతను చనిపోయి ఉన్నాడు. అతని తలకు రక్తస్రావం అవడంతోపాటు పక్కనే పెద్దరాయి ఉంది. స్థానికుల సహకారంతో కుమార్తె పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలాన్నిపరిశీలించి రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.Updated Date - 2020-12-13T05:45:43+05:30 IST