‘ముంపు ప్రమాదం లేకుండా చూడాలి’

ABN , First Publish Date - 2020-06-04T09:01:00+05:30 IST

వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కార్వాన్‌

‘ముంపు ప్రమాదం లేకుండా చూడాలి’

మెహిదీపట్నం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ సూచించారు. నానాల్‌నగర్‌ డివిజన్‌లో నుంచి వెళ్లే బుల్కాపూర్‌ నాలాక పైభాగంలో ఆర్మీ అధికారులు చెక్‌డ్యామ్‌ నిర్మించడంతో వర్షాకాలంలో టోలిచౌకీ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని స్థానికులు బుధవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జెడ్‌సీ ప్రావీణ్యతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. చెక్‌డ్యాం వల్ల ముంపు ఏర్పడకుండా చూడాలని సూచించారు. కార్యక్రకమంలో కార్పొరేటర్‌ మహహ్మద్‌ నసీరొద్దీన్‌, జీహెచ్‌ఎంసీ ఈఈ శివానంద్‌, డిప్యూటీ ఈఈ సనావుద్దీన్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-04T09:01:00+05:30 IST