మున్నురుకాపులు మరింత బలోపేతం కావాలి : మంత్రి గంగుల

ABN , First Publish Date - 2020-12-16T04:30:39+05:30 IST

మున్నూరుకాపులు రాజకీయంగా మరింత బలోపేతం కావాలని మంత్రి గంగుల కమలాకర్‌

మున్నురుకాపులు మరింత బలోపేతం కావాలి : మంత్రి గంగుల
మంత్రి గంగుల కమలాకర్‌ను సత్కరించిన మున్నూరుకాపు నేతలు

బర్కత్‌పుర, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): మున్నూరుకాపులు రాజకీయంగా మరింత బలోపేతం కావాలని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కాచిగూడలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌ బోర్డు ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మంగళవారం ఆయన విద్యార్థి వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రిని ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ మ్యాడం కిషన్‌రావు సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మున్నూరుకాపుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కాచిగూడలోని మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహాన్ని దేవాదాయ శాఖ పరిధి నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డు ప్రతినిధులు మ్యాడం వెంకట్‌రావు, గంప చంద్రమోహన్‌, జెల్లి సిద్ధయ్య, పాండురంగారావు, విష్ణువర్ధన్‌, మున్నూరుకాపు సంఘం నేతలు వి.ప్రకాష్‌, వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్‌ కొండ దేవయ్య, సుంకరి బాలకిషన్‌రావు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Read more