జయేష్ కోసం సుప్రీం కోర్టు గడప తొక్కక తప్పేట్టు లేదు: ఎంపీ అరవింద్

ABN , First Publish Date - 2020-10-07T18:53:20+05:30 IST

కేటీఆర్‌ను కాపాడటానికి జైయేష్ రంజన్ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.

జయేష్ కోసం సుప్రీం కోర్టు గడప తొక్కక తప్పేట్టు లేదు: ఎంపీ అరవింద్

హైదరాబాద్: కేటీఆర్‌ను కాపాడటానికి జైయేష్ రంజన్ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సైతం జాయేష్ రంజన్ పట్టించుకోవటంలేదని అన్నారు. ‌జైయేష్ రంజన్ కోసం సుప్రీంకోర్టు గడప తొక్కక తప్పటంలేదని ఆయన తెలిపారు. జైయేష్ రంజన్ లాంటి హ్యాండ్సమ్ ఆఫీసర్‌కు రూల్స్ తెలియదని అనుకోవడం లేదని అన్నారు. కేటీఆర్‌కు జైయేష్ రంజన్ దగ్గరగా పనిచేస్తారని విన్నానని చెప్పారు.  మోదీ ప్రభుత్వం అవినీతిని సహించదని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. 

Read more