‘సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించాలి’
ABN , First Publish Date - 2020-06-11T10:37:35+05:30 IST
లింగోజిగూడ బృందావన్‌కాలనీలో ఉన్న సరూర్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సరూర్‌నగర్ మండల కార్యాలయ కాంప్లెక్స్‌లోకి

ఎల్‌బీనగర్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): లింగోజిగూడ బృందావన్‌కాలనీలో ఉన్న సరూర్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సరూర్‌నగర్ మండల కార్యాలయ కాంప్లెక్స్‌లోకి తరలించాలని కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివా్‌సరావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కోరారు. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచనల మేరకు డివిజన్‌లోని పలు కాలనీ అసోసియేషన్ సభ్యులతోపాటు సరూర్‌నగర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆకుల అరవింద్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్‌తో కలిసి బుధవారం మంత్రిని ఆమె చాంబర్‌లో కలిశారు.