‘అమ్మ’ ఉరేసుకుంటుండగా ఫోన్ కాల్.. పాప లిఫ్ట్ చేసి..!

ABN , First Publish Date - 2020-05-17T15:07:46+05:30 IST

విచిత్ర పరిణామాల మధ్య ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది...

‘అమ్మ’ ఉరేసుకుంటుండగా ఫోన్ కాల్.. పాప లిఫ్ట్ చేసి..!

హైదరాబాద్/కుత్బుల్లాపూర్‌ : విచిత్ర పరిణామాల మధ్య ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఎన్‌సీఎల్‌ నార్త్‌లో నివాసముంటున్న శ్రీను భార్య బుక్కర విజయ(30) కొన్నిరోజులుగా మతిస్థిమితం లేనట్లు వ్యవహరిస్తోంది. శనివారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.


అదే సమయంలో కొంపల్లిలో ఉండే విజయ బంధువు ఒకరు ఫోన్‌ చేయడంతో ఇంట్లో ఉన్న విజయ ఆరేళ్ల కూతురు ఫోన్‌ లిఫ్ట్‌ చేసి ‘మా అమ్మ ఉరివేసుకుంటోంది’ అని చెప్పింది. దీంతో హుటాహుటిన బంధువు వచ్చి వేలాడుతున్న విజయను కిందికి దింపి, పోలీసులకు.. 108కు సమాచారం అందించాడు. అంబులెన్స్‌ సకాలంలో రాకపోవడంతో పోలీసులు తమ పెట్రోలింగ్‌ వాహనంలో విజయను ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-05-17T15:07:46+05:30 IST