మోదీ ప్రభుత్వానివి కార్మిక వ్యతిరేక వధానాలు: సంజీవరెడ్డి
ABN , First Publish Date - 2020-12-16T04:17:52+05:30 IST
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ అనేక సవరణలు చేస్తోందని ఐఎన్‌టీయూసీ

బర్కత్‌పుర, డిసెంబర్ 15 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ అనేక సవరణలు చేస్తోందని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ జి.సంజీవరెడ్డి ఆరోపించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ హాకర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు వెంకటమోహన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జి.సంజీవరెడ్డి మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేస్తే నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వే, బీఎ్‌సఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, బ్యాంకులు, రక్షణ, బొగ్గు, విద్యుత్ ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతున్నాయని ఆయన ధ్వజ మెత్తారు. వీధి వ్యాపారులకు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. వీధి వ్యాపారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.సత్యనారాయణ, నాయకులు పి.మోహన్, వి.శ్రీశైలం, సుబ్బారావు, రఘు, నిర్మల, కె.నవీన్, జేమ్స్‌జాన్ తదితరులు పాల్గొన్నారు.