రేపే ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రాక
ABN , First Publish Date - 2020-11-27T22:29:18+05:30 IST
రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు. ఒంటి గంటకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు

ఢిల్లీ: రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు. ఒంటి గంటకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. భారత్ బయోటెక్ పార్క్‌ను ప్రధాని సందర్శించనున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై మోదీ సమీక్షించనున్నారు. అనంతరం పుణె, అహ్మదాబాద్‌లో సీరం, జైడస్ పార్కులను మోదీ సందర్శించనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ పర్యటన ఆసక్తిరేపుతోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అధికార పార్టీ టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మోదీ రాక మరింత ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు రేపు ఎల్బీనగర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ సభ జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.