5న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దీక్ష

ABN , First Publish Date - 2020-03-04T08:12:43+05:30 IST

రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, రెగ్యులర్‌ ఉద్యోగులు, పెన్షనర్‌ల సమస్యల పరిష్కారం కోసం..

5న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దీక్ష

హైదరాబాద్‌ మార్చి 3  (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, రెగ్యులర్‌ ఉద్యోగులు, పెన్షనర్‌ల సమస్యల పరిష్కారం కోసం రెండు రోజులపాటు తలపెట్టిన నిరాహారదీక్ష కు పోలీసులు అనుమతించకపోవడంతో దీక్షను ఒక రోజుకు పరిమితం చేసినట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. 4, 5 తేదీల్లో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిరాహారదీక్ష చేసేందుకు పోలీసుల అనుమతి కోరితే 5న మాత్రమే అనుమతించినట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2020-03-04T08:12:43+05:30 IST