మానవాళికి మార్గదర్శకం భగవద్గీత

ABN , First Publish Date - 2020-12-26T06:22:44+05:30 IST

మానవాళికి మార్గదర్శకం భగవద్గీత అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో

మానవాళికి మార్గదర్శకం భగవద్గీత
డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు దంపతులను సన్మానిస్తున్న కవిత, ముఠా గోపాల్‌, కళా జనార్దనమూర్తి

గీతా జయంతి మహోత్సవంలో ఎమ్మెల్సీ కవిత

చిక్కడపల్లి, డిసెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): మానవాళికి మార్గదర్శకం భగవద్గీత అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో ఆ సభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన  శుక్రవారం గీతాజయంతి మహోత్సవం జరిగింది. కవిత గోమాతను పూజించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవద్గీతకు ఉన్న శక్తి ఏ గ్రంథానికి లేదన్నారు. గీతను అర్థం చేసుకుంటే శోకాలను దూరం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. అనంతరం  మహాసహస్ర అవధాని డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు దంపతులను బంగారు కంకణం, శాలువాతో ఘనంగా సత్కరించారు. నేను, నా కుటుంబం, నా బంధువులు వంటి మమకారాలను వీడి మనిషి ఎలా జీవించాలో, తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో తెలియజేసేదే భగవద్గీత అని గరికపాటి చెప్పారు. ధర్మం గెలవడం కోసం వ్యూహాలు ఉండాలని, అదే శ్రీకృష్ణుడి వ్యూహమని ఇవి నేటి రాజకీయాలకు కూడా అవసరమని అన్నారు. స్వార్థం కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే వ్యూహాలు శకుని వ్యూహాలని అవి సమాజానికి కూడా కీడు చేస్తాయని చెప్పారు.  ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, దేవీప్రసాద్‌, డాక్టర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. కృష్ణలీలలు నృత్యరూపక ప్రదర్శన జరిగింది. 


Updated Date - 2020-12-26T06:22:44+05:30 IST