వెయ్యి మంది ఆకలి తీర్చిన రాజాసింగ్‌

ABN , First Publish Date - 2020-03-30T09:35:54+05:30 IST

: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా

వెయ్యి మంది ఆకలి తీర్చిన రాజాసింగ్‌

మంగళ్‌హాట్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆదివారం నియోజకవర్గంలో వెయ్యి మంది పేదలకు భోజనాన్ని అందించారు.    ఆయన బోజనం అందజేసేందుకు వెళ్లిన ప్రతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు తీసుకోవడానికి వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలు ప్రాంతాలో వందల సంఖ్యలు ప్రజలు భోజనం కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దినసరి కూలీలు, పని చేస్తే గానీ పూటగడవని వారు భోజనం ప్యాకెట్ల కోసం ఎగబడడం మనసును కదిలించిందని, తన శక్తి మేరకు వారికి అండగా ఉంటానన్నారు. మంగళ్‌హాట్‌లోని బీజేపీ కార్యాలయం ఎదుట ఉన్న మైదానంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ భోజనం సిద్ధం చేయించారు. ఈ సందర్భంగా ఆయన గరిట తిప్పి భోజనం వండారు. 

Updated Date - 2020-03-30T09:35:54+05:30 IST