అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-03-27T08:48:46+05:30 IST
నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకా్‌షగౌడ్ హెచ్చరించారు.
ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ హెచ్చరిక
నార్సింగ్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకా్‌షగౌడ్ హెచ్చరించారు. గురువారం ఆయన మణికొండలోని పలు కూరగాయల దుకాణాలను, సూపర్ మార్కెట్‌లను సందర్శించి మాట్లాడారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం కూరగాయల ధర నిర్ణయించిందని, ఆ ధర ప్రకారమే విక్రయాలు చేపట్టాలని సూచించారు. కాగా మణికొండ మున్సిపాల్టీకి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన జెట్‌లాకింగ్ పారిశుధ్య యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ ఛైర్మన్ కె.నరేందర్‌రెడ్డి, కమిషనర్ జయంత్, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.