రేషన్‌ డీలర్లతో సమావేశం

ABN , First Publish Date - 2020-03-27T08:49:29+05:30 IST

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్‌ సరుకులను పంపిణీ చేయాలని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి డీలర్లకు సూచించారు.

రేషన్‌ డీలర్లతో సమావేశం

ఎల్‌బీనగర్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్‌ సరుకులను పంపిణీ చేయాలని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి డీలర్లకు సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రేషన్‌ సరుకుల పంపిణీ కార్యక్రమంపై గురువారం ఆయన ఎల్‌బీనగర్‌ పరిధిలోని  రేషన్‌డీలర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుపు రేషన్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్క కుటుంబానికి రూ.1500, కార్డులో ఉన్న ఒక్కో సభ్యుడికి 12కిలోల బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రేషన్‌దుకాణాలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు తెరిచి ప్రజలకు సరుకులను పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ జయరాం, ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృధ్వీదర్‌రావు, సీఐలు శ్రీనివా్‌సరెడ్డి, సురేందర్‌, అశోక్‌, వెంకటయ్య, యాదయ్య, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు ఎస్‌ఈ రవీందర్‌, ఈఈ కృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-27T08:49:29+05:30 IST