ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-11-25T17:36:10+05:30 IST

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్ ఈరోజు 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నారు..హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలన్నారు. గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని పేర్కొన్నారు. మళ్లీ ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెబుతున్నారని ప్రభుత్వంపై అక్బరుద్దీన్ మండిపడ్డారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్  తోక ఎలా తొక్కాలో తమకు తెలుసన్నారు.

Read more