అభివృద్ధి పనులకు రూ.7.70కోట్లు : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-06-25T09:55:14+05:30 IST

అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ.7.70కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు రూ.7.70కోట్లు : ఎమ్మెల్యే

గోల్నాక, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ.7.70కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ వెల్లడించారు. ఈ నిధులతో చేపట్టే పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని, వెంటనే  పనుల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. బుధవారం కృష్ణానగర్‌లో డ్రైనేజీ పైపులైన్‌ పనులను ఎమ్మెల్యే కార్పొరేటర్‌ కాలేరు పద్మతో కలిసి ప్రారంభించారు.  

Updated Date - 2020-06-25T09:55:14+05:30 IST