పేదలకు అండగా ప్రభుత్వం: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2020-04-01T09:17:40+05:30 IST

కొవిడ్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి, పేదలకు అండగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

పేదలకు అండగా ప్రభుత్వం: మంత్రి తలసాని

పద్మారావునగర్‌, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి, పేదలకు అండగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మంగళవారం బన్సీలాల్‌పేట్‌లోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌లో బేగంబజార్‌కు చెందిన బంకట్‌ అనే వ్యాపారి సహకారంతో 627 మంది నిరుపేదలకు 20 రోజులు సరిపడా నిత్యావసరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వలస వచ్చిన వారికి సామగ్రి పంపిణీ చేయాలని అన్నారు. మన రాష్ట్రానికి 3.5లక్షల మంది ఉపాధి కోసం వలస వచ్చారని, అందులో 85వేల మంది జంటనగరాల్లో ఉన్నారని తెలిపారు.


వలస వచ్చిన వారు ఆకలితో అలమటించకూడదని సీఎం 12కిలోల బియ్యం, 500 రూపాయల నగదు అందజేయాలని నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి ఒక్కొక్కరికి 12కిలోల బియ్యం, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు 1,500 రూపాయలు ప్రకటించారని, రెండు రోజుల్లో 85 కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. సికింద్రాబాద్‌ ఆర్డీఓ వసంతకుమారి, జీహెచ్‌ఎంసీ ఉత్తర మండల కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌, తహసీల్దార్‌ బాలశంకర్‌, కార్పొరేటర్‌ హేమలత, గాంధీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్‌, బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ ఇన్‌చార్జి గుర్రం పవన్‌కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-04-01T09:17:40+05:30 IST