పుకార్ల వల్లే ఢిల్లీలో అల్లర్లు

ABN , First Publish Date - 2020-03-02T09:36:16+05:30 IST

పుకార్ల వల్లే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని, సోషల్‌ మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి కిషన్‌రెడ్డి అన్నారు.

పుకార్ల వల్లే ఢిల్లీలో అల్లర్లు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి


రాయదుర్గం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పుకార్ల వల్లే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని, సోషల్‌ మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి కిషన్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని ఐఎ్‌సబీలో ఆదివారం 2020-ఐఎ్‌సబీ పాలసీ కాంక్లేవ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంత పెద్ద సమస్య అయినా చర్చించుకుంటే పరిష్కారం లభిస్తుందన్నారు. ఐఎ్‌సబీ లాంటి ఉన్నత విద్యాలయాల్లో డిబేట్స్‌ నిర్వహించడం వల్ల దేశాన్ని  ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాన్ని తెలుసుకోవచ్చున్నారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో దూసుకు వెళ్తున్న భారత్‌వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు.  ఈ సందర్భంగా ఆయన ఐఎ్‌సబీ క్యాంప్‌సలో మొక్కను నాటారు. కార్యక్రమంలో ఐఎ్‌సబీ డిప్యూటీ డీన్‌ సంజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T09:36:16+05:30 IST