భుక్తి కోసం బురదలోకి...
ABN , First Publish Date - 2020-05-18T09:15:48+05:30 IST
తినడానికి తిండిలేక, చేయడానికి పనిలేక, సొంతూరికి వెళ్లేందుకు తమ వంతు ఎప్పుడొస్తుందో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కూలీలు..

వలస కూలీల చేపల వేట
ఉప్పల్, మే17 (ఆంధ్రజ్యోతి): తినడానికి తిండిలేక, చేయడానికి పనిలేక, సొంతూరికి వెళ్లేందుకు తమ వంతు ఎప్పుడొస్తుందో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కూలీలు.. నీళ్లు లేక ఎండిపోయిన ఉప్పల్ నల్ల చెరువు బురద గుంటలో చేపలు పట్టుకుంటున్నారు. చెరువుల సుందరీకరణ పనుల్లో భాగంగా గతంలో చెరువులోకి వచ్చే వరద, మురుగును అధికారులు మూసీ కాలువలోకి మళ్లించారు. దీంతో చెరువు ఎండిపోయింది.
ఇటీవల కురిసిన వర్షానికి కొంత నీరు నల్ల చెరువుకు చేరింది. దాంతో పాటు కొన్ని చేపలు చేరాయి. చెరువు గుంట బురద బురదగా మారింది. ఆ బురదలోకే దిగి వారు చేపలుపడుతున్నారు. తమ పేర్లు ఉప్పల్ పోలీ్‌సస్టేషన్‌లో నమోదు చేశామని, తమ రాష్ట్రానికి వెళ్ళేందుకు ఎప్పుడు అవకాశం వస్తుందోనని ఎదురు చూస్తున్నామని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆ చెరువులోవి క్యాట్‌ఫిష్ అయి ఉంటాయని, వాటితో ప్రమాదం పొంచి ఉంటుందని కొందరు స్థానికులు చెబుతున్నారు.