వలస కార్మికులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2020-06-04T08:58:33+05:30 IST

వలస కార్మికులను, కార్మికులను, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ

వలస కార్మికులకు న్యాయం చేయాలి

రాజేంద్రనగర్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): వలస కార్మికులను, కార్మికులను, రైతులను  ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పుస్తకాల నర్సింగ్‌రావు ఆరోపించారు. బుధవారం బుద్వేల్‌ రోడ్డులో పార్టీ మండల శాఖ కార్యదర్శి ఎం.ఏ రియాజ్‌ నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వలస కార్మికులకు, కార్మికులకు కార్మిక సంక్షేమ బోర్డు నుంచి సౌకర్యాలు కల్పించకపోగా, వారి కోసం కేటాయించిన నిధులను మళ్లించారని వారు ఆరోపించారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు బండి నర్సింహ్మ, రాంచందర్‌, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T08:58:33+05:30 IST