రాత్రి 9.30 వరకు మెట్రో సేవలు

ABN , First Publish Date - 2020-10-28T09:47:24+05:30 IST

హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు

రాత్రి 9.30 వరకు మెట్రో సేవలు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు  పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో మార్చి 22 నుంచి నిలిచిపోయిన  సేవలను సెప్టెంబర్‌ 7 నుంచి పునఃప్రారంభించారు. అప్పటి నుంచి దశల వారీగా మూడు కారిడార్‌లలో మెట్రో రైళ్లను నడుపుతున్నారు. క్రమంగా మెట్రో రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతుండడంతో రాత్రి 9.30 గంటల వరకు నడపాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. గతంలో మాదిరిగా ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు నడపాలని నగర వాసులు కోరుతున్నా, ప్రస్తుతం అరగంట మాత్రమే పొడిగిస్తున్నట్లు, పొడిగించిన సమయాలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-10-28T09:47:24+05:30 IST