4.50 లక్షలకు చేరువలో.. మెరుగైన మెట్రో కనెక్టివిటీ

ABN , First Publish Date - 2020-02-12T10:24:05+05:30 IST

జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మెట్రో కారిడార్‌ ప్రా రంభంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు

4.50 లక్షలకు చేరువలో.. మెరుగైన మెట్రో కనెక్టివిటీ

  • కారిడార్‌-2తో పెరిగిన ప్రయాణికులు 

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మెట్రో కారిడార్‌ ప్రా రంభంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య  పెరిగింది. ఇప్పటి వరకు  రెండు కారిడార్‌ల పరిధి లో నిత్యం సుమారు 4 లక్షల మంది ప్రయాణిస్తుండగా, ఈనెల 7న ప్రారంభమైన కారిడా ర్‌-2 (జేబీఎ్‌స-ఎంజీబీఎ్‌స)తో 33వేలకు పైగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలను కలుపుతూ అతి పెద్ద బస్‌స్టేషన్లయిన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ల మధ్య మెట్రో రైలుతో అనుసంధానం  చేయడంతో  ప్రయాణికుల సంఖ్య ఆశించిన స్థాయిలో ఉంది. మెట్రో అధికారులు ముందు గా ఊహించినట్లుగానే  మూడు రోజుల్లోనే 30 వేల మంది కారిడార్‌-2లో ప్రయాణించడంపై మెట్రో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య 5 లక్షలు దాటే అవకాశం ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు. 

కారిడార్‌ల వారీగా...

కారిడార్‌ ప్రయాణికులు దూరం

కారిడార్‌-1లో 2,45,825 29 కి.మీ

కారిడార్‌-2 33,886 11 కి.మీ

కారిడార్‌-3 1,67,298 29 కి.మీ

మొత్తం మెట్రో 

ప్రయాణికులు 4,47,009 69 కి.మీ 

Updated Date - 2020-02-12T10:24:05+05:30 IST