క్రీడలతో మానసిక దృఢత్వం
ABN , First Publish Date - 2020-03-08T10:36:32+05:30 IST
శారీరక, మానసికోల్లాసం, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా

- హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా
హైదరాబాద్ సిటీ(ఆంధ్రజ్యోతి): శారీరక, మానసికోల్లాసం, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా పేర్కొన్నారు. సైబరాబాద్‌లో కమిషనరేట్‌లో నిర్వహిస్తున్న యాన్యువల్ సోర్స్ట్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవిగుప్తా దంపతులు, సినీ నటి నమ్రతా శిరోద్కర్, సీపీ సజ్జనార్ దంపతులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. పురుషులు, మహిళా పోలీస్ సిబ్బందికి వేర్వేరుగా నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంను గాల్లోకి తుపాకీ కాల్చీ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రవిగుప్తా, సీపీ సజ్జనార్ టీమ్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లు కొనసాగిన ఈ పోటీలో రవిగుప్తా టీమ్ విజయం సాధించింది. కార్యక్రమంలో పోలీస్ అధికారులు నిర్వహించిన మార్చ్ ఫాస్టు అందరినీ ఆకర్షించింది. అనంతరం క్రీడల్లో గెలిచిన విజేతలకు రవి గుప్తా, ఆయన సతీమణి అంజలి గుప్తా, మాజీ సినీ నటి శ్రీమతి నమ్రతా శిరోద్కర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ దంపతులు బహుమతుల అందజేశారు.